హెచ్ఐవి పట్ల అవగాహన సదస్సు
అశ్వరావుపేట నవంబర్ 12( జనం సాక్షి )
హెచ్ఐవి సుఖవ్యాధుల పట్ల మండలంలోని నారాయణపురం గ్రామంలో అవగాహన సదస్సునిర్వహించారు. అశ్వరావు పేట మండలంలోని నారాయణపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో జరిగిన చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నారాయణ పురం సర్పంచ్ సహకారం తో హెచ్ఐవి సుఖవ్యాధుల పై అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యటం జరిగింది ఈ సందర్భంగా సూపర్వైజర్ మధుబాబు సుఖవ్యాధుల పై అవగాహన కల్పించారు హెచ్ఐవి అనేది చాప కింద నీరులా పాకుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవాలి అని చెప్పారు హెచ్ఐవి తో జీవిస్తున్న వారికి ప్రభుత్వం 2016 రూపాయలు అందిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమలో సర్పంచ్ పరమేశ్ ,ఉప సర్పంచ్ వాసు , ఏఈఓ రామకృష్ణ ,లింక్ వర్కర్ స్వప్న ,మరియు అంగన్వాడి టీచర్ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




