హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందం రద్దుపై భిన్నాభిప్రాయాలు లేవు : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్‌ కొనుగొలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో దాచిపెట్టాల్సింది ఏమీ లేదని… దర్యాప్తు వివరాలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో వెల్లడిస్తామని చెప్పారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.