హైదరాబాద్ : హెల్త్‌కార్డు విధివిధానాలపై తెలంగాణ ఉద్యోగసంఘల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షరతులతో కూడిన హెల్త్‌కార్డులు ఇస్తే అంగీకరించేదిలేదని చెప్పారు. అలాంటి పథకంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొనరన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఒప్పందానికే తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. ఉద్యోగం సమస్యలతో పాటు తెలంగాణ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలంగాణ ఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు.




