హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచాలి.
ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి) నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ కు యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ తక్షణమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని పత్రంలో కోరారు. కార్యక్రమంలో డి స్రవంతి, కే సునంద, పి రాణి, సుల్తానా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.