హైకోర్టులో జరిగిన గొడవపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యమం సందర్భంగా హైకోర్టులో జరిగిన గొడవలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. కేసును హైదరాబాద్‌ హైకోర్టుకు మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను అగస్టు రెండో వారానికి వాయిదాపడింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడే న్యాయమూర్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, న్యాయమూర్తులను హైకోర్టులో కొట్టడం తప్ప అన్ని రకాల విధ్వంస చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. హైకోర్టులో గొడవ జరుగుతుంటే ప్రభుత్వం చూస్తు ఉండిపోయిందని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో హైకోర్టులను మూసివేయాల్సిందేనని స్పష్టం చేసింది.