Wednesday, 4 November 2026

హైకోర్టు ముందు హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా జనగామా శాసనసభా స్థానానికి 2009లో జరిగిన సాధారణ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ కోసం మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టుకు రెండో రోజు కూడా హాజరయ్యారు. జనగామా స్థానం నుంచి పొన్నాల ఓట్లను తారుమారు చేసి నెగ్గారని, రీకౌంటింగ్‌ చేపట్టాలని ఆయన సమీప ప్రత్యర్థి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మంత్రి నిన్న కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. విచారణ నేటికి వాయిదాపడటంతో మరోసారి కోర్టు ముందు పొన్నాల హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *