Wednesday, 4 November 2026

హైకోర్టు విభజన కోసం బాబుకు వినతిపత్రం

హైదరాబాద్ (మార్చి 05): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని ఏపీ సిఎం చంద్రబాబుకు తెలంగాణ అడ్వకేట్ జెఎసి, అఖిలపక్షం నేతలు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో చంద్రబాబును కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా రంగారెడ్డి తదితర జిల్లాల్లో తెలంగాణ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలకు ఉపక్రమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *