Monday, 2 November 2026

హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

 హైదరాబాద్‌, అక్టోబరు 6 : నగరంలోని చింతల్‌ పరిధిలోని వాణీనగర్‌లో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు ఉరేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన చింతల్‌ సంచలనం సృష్టించింది. మృతుల్లో కేశవరావు, వనజ, నందిత, దీపక్‌లున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతతులు కోల్‌కతా నుంచి వచ్చి ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల బంధువులను పోలీసులు సంప్రదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *