హైదరాబాద్, ఆగస్టు 18 : నగరంలో ఆయిల్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పెట్రోల్, డిజిల్ నిల్వలను గుర్తించిన పోలీసులు రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు




