హైదరాబాద్, ఆగస్టు 18 : టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఉదయం కేకేకు ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు యాంజియోప్లాస్టీ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షల అనంతరం రేపు(బుధవారం) కేకేను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు.
టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావుకు ఛాతీనొప్పి




