హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సైదాబాద్, అంబర్ పేట, కోఠి, నాంపల్లి, జూబ్లీహిల్స్, లక్డికాపూల్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లిలో భారీ ఎత్తున వర్షం పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది.




