హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, మలక్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్‌లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.




