తొలుత భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
సికింద్రాబాద్‌లో పరిమితంగా అమిత్‌షా రోడ్డు షో
భారీగా స్వాగతం పలికిన బిజెపి నేతలు
రోడ్డు పొడవునా కదిలిన కాషాయదళం
బోనాలతో స్వాగతం పలికిన మహిళలు
హైదరాబాద్,నవంబర్29 (జనం సాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా రోడ్డుషోలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. బోనాలతో స్వాగతం పలికారు. రోడ్‌ఉ షో వెంట ప్రజలు కిక్కిరిసి పోయారు. అయితే ఆయన ప్రసంగించకుండానే, ర్యాలీని సగంలోనే ఆపేసి వెళ్లిపోయారు. అమిత్ షా రోడ్ షోలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీతాఫల్‌మండి నుంచి వారసిగూడ వరకు రోడ్లన్నీ కాషాయమయం అయ్యాయి. తెలంగాణ సంప్రదాయ మైన బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున అమిత్ షాకు స్వాగతం పలుకుతూ రోడ్ షోలో పాల్గొన్నారు.
అంతకుముందు హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి.అమిత్ షా హైదరాబాద్ పర్యటన దృష్ట్యా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సౌత్‌జోన్ పోలీసులతో పాటు అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్ బయల్దేరి వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.
హైదరాబాద్‌లో ప్రచారానికి అమిత్ షా




