హైదరాబాద్, మార్చి 22 : నగరంలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు కేంద్రాల్లో పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కేంద్రాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్‌బాక్స్‌లు చాదర్‌ఘట్‌లోని విక్టరీ ప్లే గ్రాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు సా్ట్రంగ్‌రూమ్‌లను ఏర్పాటుచేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో 2,86,111 మంది ఓటర్లుకు గాను 413 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 151, రంగారెడ్డిలో 165, మహబూబ్‌నగర్‌లో 97 స్టేషన్లు ఉన్నాయి. నగరంలోని 151 పోలింగ్ కేంద్రాల్లో 182 ప్రి సైడింగ్ అధికారులు, 182 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 364 మంది పోలింగ్ ఆఫీసర్లు, 166 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసే పట్టభద్రులు తమతోపాటు ఎదైనా గుర్తింపుకార్డు తీసుకుని బూత్‌లకు వెళ్లాలని అధికారులు సూచించారు. మొదటిసారిగా ఈ ఎన్నికల్లో ‘నోటా’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.




