Thursday, 5 November 2026

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కాషాయగూడ, కాప్రా, ఏఎన్‌రావు నగర్‌, కీసర, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌లలో ఈదురుగాలులతో వడగళ్ల వర్షం పడుతోంది. వనస్థలిపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉప్పల్‌డినో, మేడిపల్లి ప్రాంతాలలో వడగళ్ల వాన కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *