హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ అల్తమన్ కబీర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర న్యాయసేవా సంస్థ నగరంలోని సివిల్‌కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ పీసీ ఘోష్ తదితరులు పాల్గొననున్నారు.




