Tuesday, 3 November 2026

సీలేరు నదిలో జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి

విశాఖ: సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి చెందాడు. జెన్‌కోలో పనిచేస్తున్న మేకా శ్రీనివాస్‌ ఈ ఉదయం నదిని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *