లక్ష్మణ్
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి మరి కొంత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు తయారు కావాల్సిన అవసరం ఉందని మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. హెచ్‌సీఏ టోర్నీల్లో సత్తా చూపిన అటగాళ్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించింది. అవార్డు ప్రధాన కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు మాజీ సెలక్టరీ వెంకటపతిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ తరపున భారత అండర్ 19 జట్టుకు ఎంపికైన మిలింద్‌తో పాటు పలువురు క్రికెటర్లకు అవార్డులు అందజేశారు.




