హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ను కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్ కొండమల్లేపల్లి జనవరి 12 జనం సాక్షి న్యూస్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ను కలిసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పూరే లక్ష్మణ్ ఈ సందర్భంగా వూరే లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని గాంధీ భవన్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇన్చార్జి హోదాలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్నారని కీలక అంశాలపై చర్చలు జరపనున్నారని పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీని కూడా నిర్వహిస్తున్నారు డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో మాణిక్రావు థాక్రే చర్చిస్తున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్రెడ్డి పాదయాత్రపైనా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉందని తెలిపారు అయితే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయటానికి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు ఆర్యవైశ్యులకు కచ్చితంగా కేటాయించాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ కొణిజేటి రోశయ్యకి ఇచ్చిన అవకాశాలను ఆర్యవైశ్య సోదరులకు కూడా ఇవ్వాలని కొత్త ఇన్చార్జి దృష్టికి తీసుకు వచ్చాను అని తెలిపారు గతంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రోశయ్య కు ఉన్నత పదవులు ఇచ్చినట్లు నల్లగొండ జిల్లా సీనియర్ మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి కి కూడా ఏఐసిసి కమిటీలు ఉన్నత స్థానం ఇవ్వాలని కుందూరు జానారెడ్డి కి ఏఐసీసీలో ఉన్నత పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో దాని ప్రభావం ఉంటుందని అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేకుండా విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సోదరులకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నూతన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను లిఖితపూర్వకంగా కోరానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మరియు అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు, నియోజవర్గ ఇన్చార్జీలు కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ




