Thursday, 5 November 2026

మానసికోల్లాసం -జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

మానసికోల్లాసం

-జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 12 క్రీడలు వలన యువతకు ఆరోగ్యం, శరీర దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.
గురువారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని పోతురాజు శంకరమ్మ సేవాదళం ఆధ్వర్యంలో ఓపెన్ క్యాటగిరి కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్, డీఎస్పీ ఎన్ సి హెచ్ రంగస్వామి లు హాజరై కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా దృడంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు.
నిజ జీవితంలో సమిష్టి కృషితోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని అన్నారు. ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జోగుల రవి, అడ్వకేట్ జలగరి అశోక్, మధుసూదన్ గౌడ్, దశరథంసాగర్, నాగరాజు యాదవ్, రాజేష్, అబ్దుల్లా, సంపత్, అంజి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.