Thursday, 5 November 2026

హైదరాబాద్ రాష్ర్టానికి తలమానికం

telangana budget in assembly

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం తెలంగాణకు తలమానికం.. ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నగరంలో రోడ్ల అభివృద్ధి , ఆకాశ మార్గాల ఏర్పాటుకు రూ. 1,600 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైల్, మంచినీటి సరఫరా, మురుగునీటి బోర్డులకు సహాయం అందజేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ. 526 కోట్లు, హెచ్‌ఎంఆర్‌కు రూ. 416 కోట్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీకి రూ. 1000 కోట్లు ప్రతిపాదించామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *