Thursday, 5 November 2026

హోటళ్లలో శుచికి ప్రాధాన్యం

హైదారబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)  : తెలంగాణలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ¬టళ్లలో పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ప్రధాన్యం ఇస్తామని  రాష్ట్ర ¬టల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన  సద్ది వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ¬టళ్ల సమయం పెంచాలని ప్రభుత్వాన్ని కోరగా ఆమోదించారని అన్నారు. హైదరాబాద్‌లో 11 గంటలు దాటినా ¬టళ్లు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ¬టళ్లలో శుచితో రుచికి కూడా ప్రాధాన్యం ఉండేలా చూస్తామని అన్నారు. ఇదిలావుంటే  భువనగిరి ¬టల్‌ వివేరా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సద్ది వెంకట్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని హబ్సీగూడలో జరిగిన రాష్ట్ర సాధారణ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ¬టల్‌ యజమానుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. పర్యటక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ దశలో ¬టల్‌ రంగాన్ని చిన్నతరహా పరిశ్రమగా గుర్తించి రాయతీలు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *