Wednesday, 4 November 2026

హోలీ పండుగలో విషాదం

 

 

 

 

 

 

 

 

రంగుకు బదులు -పెట్రోల్ పోసి నిప్పంటించాడు
రేగోడ్ //జనం సాక్షి // మార్చి :
హోలీ పండుగ సందర్భంగా అందరూ సరదాగా సంబరాల్లో మునిగారు. సరదాగా రంగుచల్లాల.. అన్న పాపానికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడు మండలంలోని మర్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన అంజయ్య )( అంబదాస్)(32) అను వ్యక్తి అదే గ్రామంలో హోలీ పండుగలో భాగంగా షబ్బీర్ పై రంగుచల్లాలని అంబదాస్ సరదాగా షబ్బీర్ను పలకరించాడు , నాపైనే నువ్వు రంగు చల్లుతావా.. అని ఆగ్రహించిన షబ్బీర్, అంబదాస్ వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ను లాక్కొని అంబదాస్పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. చుట్టుపక్కల వాళ్ళు చూసి. మంటలను ఆరిపోయారన్నారు. అంతకుముందు చెరువు లోకి స్నానం చేసేందుకు వెళ్లాలని. ఇతరుల ద్విచక్ర వాహనంలో పెట్రోల్ లేనందున అంబదాస్ పెట్రోల్ తీసుకుని గ్రామంలోకి వచ్చారన్నారు. ఊహించని సంఘటన జరగడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమే అక్కకు వర్షైన శాంతమ్మ రేగోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సత్యనారాయణ సంఘ స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ విషయం మెదక్ డిఎస్పి సైదులు కు సమాచారం అందించడంతో, అల్లాదుర్గం సీఐ జార్జితో అక్కడికి చేరుకొని రంగస్థలంలో విచారణ జరిపారు. పూర్తి వివరాలు సేకరించుతున్నామని ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.