కురవి మార్చి/7/జనంసాక్షి న్యూస్:
మహబూబాద్ జిల్లా కొరవి మండలం తాట్య తండా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో డీజే ఆటపాటల లో సరదాగా గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు హోలీ వేడుకలలో జరుపుకోవడం జరిగింది.అంతేకాకుండా గ్రామ యువతీ యువకులు నృత్య కార్యక్రమాలుతో పాల్గొనడం జరిగింది.గ్రామంలోని అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా బానోత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ…హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరారు.డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.మళ్లీ నూతన సంవత్సరంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అన్నారు.పేదవారికి కాంగ్రెస్ పార్టీతోనే సరైన న్యాయం జరుగుతుందని మళ్లీ పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీతోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు వారికి చేరుతాయన్నారు.బిఆర్ఎస్ పార్టీ కొనసాగినంత కాలం నిరుపేదలుకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.అధికార పార్టీకి ప్రభుత్వ అధికారుల కూడా బలైపోతున్నారన్నారు.ప్రభుత్వ అధికారులు పేదవారికి ఎలాంటి న్యాయం చేయడంలో పూర్తిగా విప్లమయ్యారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలు నిత్యవసరుల సరుకుల ధరలు పెంచి నడ్డి విరుస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి,కాంగ్రెస్ పార్టీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బలపరిచే విధంగా ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు.రాబోయే ఎలక్షన్ లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన గుణపాఠం ప్రజలు చెప్పాలన్నారు.అధిక మెజార్టీలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజల్ని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సక్రం నాయక్,బానోతు.వీరు,భూక్య.సోమ్లా నాయక్,బానోతు.వీరన్న నాయక్,లోనావత్.తేజ నాయక్,భూక్య లాలూ నాయక్, భూక్య.శివ భూక్య.భీమా,బానోతు. శివ,యూత్ నాయకులు,లూనావత్. అశోక్,లోనావత్.ప్రసాద్,బానోతు. గణపతి,తేజావత్.సాయి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.




