బెల్లంపల్లి, ఏప్రిల్ 25, (జనంసాక్షి )హ్యాట్రిక్ విజయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహుమతి అందిద్దాం అని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జి నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆరెస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆరెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెసిఆర్, బీఆరెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ఈసమావేశం నిర్వహించుకుంటున్నామన్నారు. బీఆరెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని, బీఆరెస్ పార్టీ బాగా ఉంటేనే బీఆరెస్ పార్టీ ప్రతినిధులమైన మనమందరం కూడా బాగుంటామని అన్నారు. బీఆరెస్ పార్టీ కుటుంబసభ్యులమైన మనమందరం కన్నతల్లిలాంటి బీఆరెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.బీఆరెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం భారతదేశానికి కూడా అత్యవసరం కాబట్టి మనమందరం బీఆరెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను అనునిత్యం ప్రజలకు వివరించి, కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆరెస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని హ్యాట్రిక్ విజయంతో కెసిఆర్ కు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గ బీఆరెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, డైరెక్టర్లు, నియోజకవర్గ బీఆరెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆరెస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, బీఆరెస్, బీఆరెస్వై, బీఆరెస్వి, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, బీఆరెస్ పార్టీ శ్రేణులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు …




