Thursday, 5 November 2026

1నుంచి సిపిఎం మహాసభలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : మార్చి 1 నుంచి 4 వరకు సిపిఎం మహాసభలు హైదరాబాద్‌లో కొనసాగుతాయని స్థానిక నేతలు అన్నారు. 4న జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలన్న తలంపుతో ఇంటింటికి సీపీఎంను కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రీ వెల్లడించారు. ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన హావిూలను మరిచిపోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదన్నారు. లేనిపోని హావిూలతో అధికారంలోకి వచ్చిన తెరాస ఇప్పటి వరకు చేసిందేమిలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు.  పార్టీ రాష్ట్ర మహాసభల జయప్రదానికి విరాళాలను సేకరించడంతో పాటు ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ఇంటింటికి సీపీఎం’ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.  ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి ఉద్యమ కార్యచరణను రూపొందేందుకు మార్చి 1నుంచి 4వరకు రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నమన్నారు. పార్టీనేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లీ ప్రతిఇంటిని సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీకి విరాళాలను సేకరించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *