హైదరాబాద్,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యచరణపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబరు 1 నుంచి 7 వరకు ముల్కీ అమరవీరుల స్మృతి వారంగా పాటిస్తామని చెప్పారు. సెప్టెంబరు 1 నుంచి 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు, సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.




