Tuesday, 3 November 2026

10 ఉత్తీర్ణతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు

10 ఉత్తీర్ణతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు* ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య* విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు బహుకరణ టేకులపల్లి,మార్చి 28 ( జనంసాక్షి): పదవ తరగతి ఉత్తీర్ణతతోనే విద్యార్థినీ,విద్యార్థులకు మంచి భవిష్యత్తుని సూచిస్తుందని, విద్యార్థులకు 10వ తరగతి తొలిమెట్టని సులానగర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య అన్నారు. మంగళవారం మండలంలోని సులానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉప సర్పంచ్ బసవయ్య ఆధ్వర్యంలో 39 మంది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ పెన్నులను వితరణ చేస్తూ ఆయన చేతులు మీదుగా అందించారు. ముందుగా గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర బుజ్జి  విద్యార్థులకు హాల్ టికెట్లను అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, టీచర్లు, స్థానిక యూత్ విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు. 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలను భరించి మనలను చదివించిన మన తల్లిదండ్రులకు మనమిచ్చే గొప్ప కానుక మన విజయమేనని వారు అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందానికి అవధులు ఉండవని, పాఠాలు బోధించిన టీచర్లకు, అష్ట కష్టాలు పడి చదివించిన తల్లిదండ్రులకు, ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకు వచ్చినందుకు గ్రామస్తులు ఎంతో ఆనంద పడతారని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎదుగుదలకు, ఉన్నత స్థానాలకు ఎదగడానికి, మంచి ఉద్యోగాలు చేయడానికి, ఏ రంగంలోనైనా రాణించడానికి చదివే ప్రాధాన్యమని, ప్రతి ఒక్క విద్యార్థి అది దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకొని గొప్ప మార్కులు సాధించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్�