హైదరాబాద్,(జనంసాక్షి): అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ& ప్రశాంతంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 31.1 శాతం పోలింగ్ నమోదైందని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 42 శాతం నమోదైందని తెలిపారు. పోలింగ్ సందర్భంగా హింస చెలరేగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.




