Thursday, 5 November 2026

101 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధురాలికి సన్మానం

101 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధురాలికి సన్మానం

వరంగల్ బ్యూరో చీఫ్, జనవరి 15 (జనం సాక్షి)

స్థానిక గంగపుత్ర వీధి ,రంగశాయిపేట లో 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుండు ఈరమ్మ కు వారి మనమరాళ్ళు సన్మానం చేసారు. గుండు ఈరమ్మ కి ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డల సంతానం.ఇప్పటికి తన పని తనే చేసుకుంటూ, అందరికి ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ ఆరోగ్యం గా ఉండడం ఒక గొప్ప వరం గా తన గురించి అందరూ కొనియాడారు. మొత్తం కుటుంబసభ్యులు 75 మంది ఉన్నారు. ఈ కార్యక్రమం లో మనమళ్ళు, మనమరాళ్ళు, ముని మనమళ్ళు, మనమరాళ్ళు పాల్గొన్నారు.