Thursday, 5 November 2026

ఘనంగా మాయావతి జన్మదిన వేడుక

ఘనంగా మాయావతి జన్మదిన వేడుక

మర్పల్లి జనవరి15 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి 67వ జన్మదిన వేడుకలను ఆదివారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మర్పల్లి మండల అధ్యక్షులు పర్యవేద శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజనులకు చైతన్యం రావాలని రాజ్యాధికారం దిశగా విద్యా వైద్యం ఉచితంగా అందించాలని, నిరుపేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్ జిల్లా మైనారిటీ కో కన్వీనర్ సయ్యద్ అమీర్, మండల్. ప్రధాన కార్యదర్శి కావలి ప్రభాకర్, శ్రీకాంత్, సెక్టర్ అధ్యక్షులు మస్తాన్, సజ్జత్ మాక్ బులు అరవింద్, చిన్న తదితరులు పాల్గొన్నారు.