శంషాబాద్: శంషాబాద్‌లో పనిచేసే 108 సిబ్బంది గాయపడ్డ వ్యక్తి జేబులో ఉన్న భారీ మొత్తం డబ్బును గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. కాటేదన్ ప్రాంతానికి చెదిన హుసేన్ యువకుడు బైక్‌పై వెళ్తూ గగన్‌పహాడ్ సమీపంలో రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చూసిన స్థానికులు 108 సిబ్బంధికి ఫోన్ చేయగా వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రున్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడి సృహ కోల్పోయిన హుసేన్‌ను ఆసుపత్రిలో చేర్పించేటప్పుడు జేబుల్లో చూడగా రూ.80 వేలు నగదు, మొబైల్ పోన్ లభించింది. మొబైల్‌లోని నెంబర్ ఆధారంగా క్షత గాత్రుని కుటుంబానికి సమాచారం అందించారు. కుటుంబీకులకు రూ.80 వేలు, మొబైల్‌పోన్ పైలెట్ కొమురయ్య అందించి ఔదర్యాన్ని చాటుకున్నాడు.




