Thursday, 5 November 2026

12 వేల మందితో శృంగారం చేశాడట!

జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ ప్రిన్సిపాల్ ఏకంగా 12 వేల మంది మహిళలతో రాసలీలలు కొనసాగించారు. వీరందరికీ డబ్బులు చెల్లించి తన కామ కలాపాలు కొనసాగించినట్టు వెల్లడించాడు. దీంతో ఈ కామ ప్రిన్సిపాల్ ను టోక్యో నగర పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ కామాంధుడి పేరు యుహీ తకషిమా. అతని వయస్సు 64 ఏళ్లు. ఫిలిప్పిన్స్‌లో ప్రిన్సిపాల్ గా పని చేసిన ఈ ప్రబుద్ధుడు గత 27 ఏళ్ల కాలంలో మాయమాటలు చెప్పి లక్షా 50 వేల మంది మహిళలతో న్యూడ్ ఫొటోలు దిగాడు. అంతేగాకుండా తాను సేకరించిన మహిళల ఫొటోలతో 400 ఆల్బమ్స్ కూడా తయారు చేసి భద్రపర్చాడు. తన తీపి జ్ఞాపకాలకు గుర్తుగానే ఫొటోలను భద్రపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. 1988 నుంచి డబ్బులు చెల్లిస్తూ మహిళలతో శృంగారం జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 14 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులైన 12 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు పోలీసులకు వివరించాడు. తాజాగా 14 యేళ్ల అమ్మాయితో సెక్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో అతన్ని జపాన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *