Tuesday, 3 November 2026

14కి చేరిన మృతుల సంఖ్య మరో ఇద్దరి కోసం గాలింపు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హోటల్‌లో పనిచేసే వంట మనిషి, మరో కార్మికుడు కనిపించడంలేదని అధికారులు గుర్తించారు. వారిద్దరూ భవన శిథిలాల్లో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఆధ్వర్యంలో రెండు ప్రొక్లెయిన్లతో శిథిలాలను తొలగించి, లారీల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. సాయంత్రం వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని కృష్టబాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *