నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలయ సమీపంలో ఉన్న కొత్త శ్రీవానిసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి రూ. 5లక్షల విలువైన బంగారు అభరణాలు, 6కిలోల వెండి వస్తువులు, రూ. 2లక్షల నగదు అపహరించారు. శ్రీవానిసరావు శనివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూడగా ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. ఇది గమనించిన శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించారు. రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్సై మౌలా షరీఫ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




