–
జనంసాక్షి, మంథని : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఈనెల 14 వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 3:00 గంటలకు జరిగే జై సత్యాగ్రహ దీక్షకు వస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్షాలు లేకుండా చేస్తా ఊన్న అనేక అంశాల పట్ల రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కాపాడాలని జై సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ, సీఎల్పీ, రాష్ట్రంలోని రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.




