ఝరాసంగం ఏప్రిల్ 11( జనం సాక్షి ): ఝరాసంగం మండల కేంద్రంలోని ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాబు జగ్జివన్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు రాయికోటి నర్సింలు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషిచేసిన సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే మహిళ అభివృద్ధికి మార్గదర్శి,నిత్య స్ఫూర్తిప్రదాత,అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఝరాసంగం పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్,సిసి మల్లేశం, బీజేఆర్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చింతలగట్టు శివరాజ్, జహీరాబాద్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ పాండు ముదిరాజ్, దేవరంపల్లి ఉపసర్పంచ్ శివశంకర్,సీఆర్పీ చిరంజీవి మహిళా సంఘాల సభ్యులు తధితరులు పాల్గొన్నారు.




