నాచారం : హైదరాబాద్ శివారు నాచారం గ్రామంలో గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న యువకులపై కొంత మంది రాళ్లతో దాడి చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదుపుచేయడానికి వెళ్లిన మల్కాజిగిరి ఏసిపి రాధాకిషన్ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అదనపు బలగాలను రప్పించి 144 సెక్షన్ విధించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.




