Thursday, 5 November 2026

15 న నిరుద్యోగ మార్చ్ కు తరలిరండి

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్ ఏప్రిల్ 13 (జనం సాక్షి)ఈనెల 15న హన్మకొండ లో నిర్వహించే నిరుద్యోగ మార్చ్ కు ప్రతి ఒక్క నిరుద్యోగి తోపాటు ప్రజలు పెద్ద మొత్తంలో హాజరు అవ్వాలని వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బిజెపి సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిలుపునిచ్చారు ఈ మేరకు గురువారం 42 వ డివిజన్ రంగసాయిపేట సగర భవనంలో సీనియర్ బిజెపి నాయకులు కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టి పి ఎస్ సి పేపర్ లీక్ ద్వారా నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించేందుకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని ప్రదీప్ రావు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు కొల్లూరి యోగానంద్, నల్లబోల విష్ణు, సోమ వినయ్, నాగేల్లి సత్యనారాయణ, నలబోలా నాగరాజు,  దేవునురి వెంకన్న,  అని శెట్టి వేణు, సోమ అనిల్, మనోహర్, కొడిపాక మధు, రంజిత్, కందిమల్ల మహేష్, కృష్ణ కిషోర్, పోలేపాక సందీప్, అర్జున్, రవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.