భువనగిరి టౌన్ జనం సాక్షి భువనగిరి పట్టణంలోని స్థానిక 20 వార్డు అభివృద్ధిలో భాగంగా గాంధీనగర్ వద్ద ఉన్న పెద్ద డ్రైనేజీ నిర్మాణం కొరకు పక్కన ఉన్న కోటగడ్డ సర్వేనెంబర్ 2 భువనగిరి స్థలాన్ని చదును చేయడం జరిగింది. ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులు పట్టాదారుల కబ్జాలో సర్వే నెంబర్ 2 పట్టణంలో ఉన్నందున సమగ్ర సర్వే చేసి పట్టాదారులకు వారి యొక్క భూమి హద్దులను నిర్మించి మిగతా భూమిపై ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలరని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఎమ్మెల్యే తానే స్వయంగా వచ్చి నేను ఎవరి భూమి తీసుకోను సర్వే చేయించి ప్రభుత్వ భూమిపైనే మా అభివృద్ధి ఉంటది అని చెప్పి ఇప్పటివరకు సర్వే చేయించడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారిని కోరేది ఏమిటంటే ఇక్కడ ఉన్న పట్టాదారులు ఆందోళనకు గురి అవుతున్నారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా సర్వేనెంబర్ 2 భువనగిరి పట్టణంలో సమగ్ర సర్వే చేయించగలరని కోరుచున్నాము .ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మార్వో గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వేయర్ చేసిన సర్వే చదును చేసిన ఉన్న భూమిని మ్యాపు చూయించి ఇది సర్వేనెంబర్ 126 భువనగిరి బ గా యత్ అని తెలియజేయడం జరిగినది తప్పుడు సమాచారంతో పట్టాదారులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా పట్టాదారులకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ తంగానపల్లి రవికుమార్ ,కౌన్సిలర్ పచ్చళ్ల హేమలత జగన్ ,చల్లగురుల రఘుబాబు, గుమిడేల రమేష్




