హైదరాబాద్ : కడప జిల్లా రాజంపేట మండలంలోని రామాపురం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 15లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 40 ఎర్రచందనం దుంగలతో పాటు ఇద్దరు దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మినీలారీలో అరటికాయల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు.




