హైదరాబాద్ : నాందేడ్ ఎక్సెప్రెస్ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతులను గుర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులు లలిత, బసవరాజు, సర్వమంగళ, పద్మిని, ఖండోబా కులకర్ణి, సుధా, లీలా, రామానంద్, కృష్ణమూర్తి, అనిల్‌కుమార్ , రాటి చంపాలాల్, రాటి ప్రేమలత, భీమయ్య, సుభాష్ రెడ్డి, జూయి నగ్రేలుగా గుర్తించారు.




