Monday, 2 November 2026

1. బాయిల్డ్‌ రైస్‌ కొనబోం
` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం
` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌
దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అవసరాల రీత్యా రాష్ట్రాలే ఉప్పుడు బియ్యం సేకరించుకోవాలని సూచించారు. ఇకపై ఉప్పుడు బియ్యం సేకరించబోమని గత ఖరీఫ్లోనే చెప్పినట్లు వివరించారు. 2020`21 ఖరీఫ్లో 47.49 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌, 6.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరణ ఇచ్చారు.ఉప్పుడు బియ్యం సేకరించబోమని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా వెల్లడిరచడంతో ధాన్యం సేకరణపై మరోసారి అయోమయ స్థితి నెలకొననుంది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఒప్పందం మేరకు రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని వివరణ ఇవ్వడంతో పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది. కాగా పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనాల్సిందేని, లేని పక్షంలో పోరాటం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

 

2.జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం
` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వెల్లడి
న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమైన నేతలు .. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. 25 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణను చర్చించినట్టు రేవంత్‌ తెలిపారు. ఏప్రిల్‌ 4న రాష్ట్ర నేతలతో మరోసారి రాహుల్‌ గాంధీ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని జనంలోకి తీసుకెళ్తామని రేవంత్‌ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రానికి రావాలని రాహుల్ను కోరితే .. సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.‘‘వరి ధాన్యం కొనుగోలు విషయంలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల మరణాలకు కారణమయ్యారు. ఇప్పటి వరకు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాం. ఏప్రిల్‌ 1 నుంచి ప్రజాసమస్యలు, రైతులు, విద్యార్థుల సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్ధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించాం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి, అంజన్కుమార్‌ యాదవ్‌, మల్లురవి, షబ్బీర్‌ అలీ, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బలరామ్‌ నాయక్‌, మహేశ్వర్రెడ్డి తదితరులు రాహుల్ను కలిసిన వారిలో ఉన్నారు.రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్‌ తీరిక లేకుండా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఉన్న రేవంత్‌.. ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. అన్నదాతల పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిబద్ధత కేటీఆర్కు తెలియకపోవడం బాధాకరమన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్‌ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, ఉపాధి హావిూ, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనత అని రేవంత్‌ ప్రశ్నించారు. రూ.70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని గుర్తు చేశారు. ఇక్రిశాట్‌ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చామని పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా.. అని ప్రశ్నించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేవిూ కాదని రేవంత్‌ వెల్లడిరచారు.

 

3.ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక
` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌
` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు.
` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు..
కొలంబో,మార్చి 30(జనంసాక్షి): పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు..ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేళం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కొరత ఏర్పడిరది.ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సరిపడా విద్యుత్‌ లేక కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటల పాటు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తుండగా.. బుధవారం నుంచి దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల పాటు కరెంట్‌ కోతలు ఉండనున్నాయి.ఇంధనం సరిపడా లేక హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడిరది. భారత్‌ సహకారంతో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది అత్యవసర సేవలు, పవర్‌ స్టేషన్లకే సరిపోతుందని శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడిరచారు. విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక అనేక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్‌ వెలుతురులో వ్యాపారాలు సాగిస్తున్నారు.సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్‌ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడిరది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్‌ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్‌తో పాటు కూరగాయాల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోతుండగా.. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలిసింది. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి.

 

4.పెరిగిన ఎండల తీవ్రతతో బడి వేళలు తగ్గింపు
` ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు నిర్వహణ
` విద్యాశాఖ నిర్ణయం
` ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్‌
హైదరాబాద్‌,మార్చి 30(జనంసాక్షి): తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్‌ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది.రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీరాజ్‌, విద్యాశాఖల కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ మాణిక్‌ రాజ్‌, భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్న కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కవ అవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న రెండ్రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. సరిపడా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని సీఎస్‌ కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఉపాధిహావిూ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలన్నారు.

 

5.తెలంగాణ ఐసెట్‌, పీజీఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదల
వరంగల్‌,మార్చి 30(జనంసాక్షి):తెలంగాణలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు మంగళవారం ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022`23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్సెట్‌, టీఎస్‌ ఈడీసెట్‌, టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ప్రకటించారు. తాజాగా రాష్ట్రంలో నిర్వహించనున్న ఐసెట్‌, పీజీఈసెట్‌ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 27 వరకు ఐసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ పేర్కొంది. రూ.250 ఆలస్య రుసుంతో జులై 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్‌ పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 4న ప్రాథమిక కీ, 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ వెల్లడిరచింది.ఎంటెక్‌, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 12 నుంచి జూన్‌ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో జులై 10వ తేదీ వరకు పీజీఈసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీఈసెట్‌ పరీక్షల కన్వీనర్‌ తెలిపారు. జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీఈసెట్‌ పరీక్ష జరుగుతుంది.

 

6.ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
` హోం మంత్రి మహమూద్‌ అలీ వెల్లడి
హైదరాబాద్‌,మార్చి 30(జనంసాక్షి): పెండిరగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో పెండిరగ్‌ చాలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనాదారులు ఈ`చలాన్‌ సైట్‌ ఓపెన్‌ చేయడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. సర్వర్‌ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టెందుకు ఎక్కవ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రకటించారు.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల పెండిరగ్‌ చలాన్ల చెల్లింపులు జరిగాయని వివరించారు. చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.250కోట్ల ఆదాయం వచ్చిందని హోం మంత్రి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున వారి విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌ 15 వరకు పెండిరగ్‌ చలాన్లపై రాయితీ అవకాశాన్ని పొడిగించినట్టు చెప్పారు. ఇప్పటివరకు చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ`చలాన్‌ వెబ్సైట్లో ఆన్లైన్‌ పేమెంట్‌ ద్వారా పెండిరగ్‌ చలాన్లు క్లియర్‌ చేసుకోవాలని హోం మంత్రి సూచించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం రాయితీని ఇచ్చిన విషయం తెలిసిందే.

 

7.సిట్‌ చెప్పినా ఎందుకు స్పందించలేదు?
` ఆశిష్‌ బెయిల్‌ రద్దుకు ఎందుకు ప్రయత్నించలేదు..?
` ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అసహనం
దిల్లీ,మార్చి 30(జనంసాక్షి): సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ప్రతిపాదించినా.. ఆశిష్‌ బెయిల్‌ రద్దుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.‘‘ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో అప్పీల్‌ దాఖలు చేయాలని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తోన్న న్యాయమూర్తి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలతో కూడిన నివేదికతో సిట్‌.. యూపీ అదనపు చీఫ్‌ సెక్రటరీ(హోం)కి రెండు లేఖలు పంపింది. మరి ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌ చేయలేదు..?’’ అని యూపీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీ స్పందిస్తూ.. అదనపు చీఫ్‌ సెక్రటరీకి ఎలాంటి లేఖలు అందలేదని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. సిట్‌ నివేదిక కాపీలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ నివేదికపై యూపీ సర్కారు ఏప్రిల్‌ 4 లోగా తమ సమాధానం తెలియజేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. అయితే గత నెలలో ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేయడంతో యూపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ ఇవ్వడాన్ని అలహాబాద్‌ హైకోర్టులో గట్టిగా వ్యతిరేకించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే బెయిల్ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సంబంధిత అధికారుల వద్ద పెండిరగ్లో ఉందని వెల్లడిరచింది.

 

8.త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు..
` అభ్యర్థులు ఓటీఆర్‌ తప్పనిసరిగా చేసుకోవాలి:టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్‌,మార్చి 30(జనంసాక్షి): త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడిరచింది.అభ్యర్థులు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఓటీఆర్‌ ఐడీ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడిరచారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఓటీఆర్‌లో మార్పులు చేసుకోవాలని తెలిపారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతలు నమోదు చేయాలని సూచించారు. చివరి నిమిషంలో నమోదు చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదముందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్లు ఇలా…
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్‌’పై క్లిక్‌ చేయాలి. మొబైల్‌ నంబరు పేర్కొనాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ`మెయిల్‌ ఐడీ, 1 ` 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి.అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్‌ చేసిన తరవాత టీఎస్‌పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్‌ అయ్యే పీడీఎఫ్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.ఒకవేళ సబ్మిట్‌ కన్నా ముందుగానే ‘లాగ్‌అవుట్‌’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.
ఓటీఆర్‌ ఎడిట్‌…
వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఓటీఆర్‌పై క్లిక్‌ చేయాలి. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసిన తరువాత ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.ఎడిట్‌ చేయాల్సిన వివరాలు సవరించడంతో పాటు 1 ` 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి. అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్‌ చేసిన తరువాత కొత్త ఓటీఆర్‌ పీడీఎఫ్‌ కాపీ జనరేట్‌ అవుతుంది.

 

9.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
` డీఏ 3శాతం పెంపు
దిల్లీ,మార్చి 30(జనంసాక్షి): ఉగాది పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగల డీఏ 31 శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది.ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50కోట్ల మేర అదనపు భారం పడనుంది.కాగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం విశేషం. అంతకుముందు గతేడాది అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3శాతం పెంచారు. జులై 2021 నుంచే ఆ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. 2021 జులైలోనే దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11శాతం పెంచారు.

 

10.ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోంది
` బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు
దిల్లీ,మార్చి 30(జనంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సులో బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.’ప్రస్తుతం ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ కూటమి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ముఖ్యం. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకొని నిలిచేందుకు ఐక్యత, సహకారం అవసరం’ అని మోదీ వెల్లడిరచారు. అలాగే ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం అంగీకారానికి రావాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ‘బంగాళాఖాతం ప్రాంతం.. అనుసంధానత, శ్రేయస్సు, భద్రతకు వారధిగా మారే సమయం ఆసన్నమైంది’ అని ప్రధాని అన్నారు.నెలరోజులకు పైగా రష్యా జరుపుతోన్న దురాక్రమణతో ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆ ఐరోపా ప్రాంతంలో ప్రాణ నష్టం సంభవిస్తోంది. సుమారు కోటిమంది ఉక్రెయిన్‌ నుంచి వలసవెళ్లినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడిరది. ఈ సమయంలో బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.బిమ్‌స్టెక్‌ .. బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, మయన్మార్‌, నేపాల్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాల కూటమి. ప్రపంచ జనాభాలో 21.7 శాతం ప్రజలు ఇక్కడే ఉన్నారు. ఈ దేశాల మొత్తం జీడీపీ 3.8 ట్రిలియన్‌ డాలర్ల పైమాటే.

 

11.రష్యాను నమ్మలేం
` ఉక్రెయిన్‌ ప్రజలు అమాయకులు కాదు: జెలెన్‌స్కీ
కీవ్‌,మార్చి 30(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్రను ముగించేలా రాజీ దిశగా కీలక ముందడుగు పడిరది. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు మొగ్గుచూపాయి.ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. చర్చల వేదిక నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ.. రష్యాను తాము పూర్తిగా నమ్మలేమన్నారు. ఈ మేరకు దేశ ప్రజలనుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.’’ఉక్రెయిన్‌ ` రష్యా మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఓ ముందడుగు పడిరది. రాజధాని కీవ్‌, ఉత్తర ప్రాంత నగరం చెర్నిహైవ్‌ సవిూపంలో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఇది పూర్తిగా ఉక్రెయిన్‌ సైనికుల వల్లే సాధ్యపడిరది. వారి ధైర్యవంతమైన చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గింది. అయినప్పటికీ మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. పరిస్థితులు ఇంకా మెరుగు పడలేదు. సవాళ్లు తొలగిపోలేదు. రష్యా సైన్యం ఇంకా పటిష్ఠ స్థితిలోనే ఉంది. మన దేశంపై దాడి కొనసాగించే అవకాశాలున్నాయి. అందువల్ల మన ప్రతిఘటనను తగ్గించకూడదు’’ అని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.గత ఎనిమిదేళ్లుగా డాన్‌బాస్‌ ప్రాంతంలో యుద్ధంతో పాటు ఈ 34 రోజుల రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ ప్రజలు చాలా నేర్చుకున్నారని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌ ప్రజలు అమాయకులు కాదని, తమ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న రష్యా మాటల్ని తాము నమ్మలేమన్నారు. కేవలం కచ్చితమైన ఫలితాలను మాత్రమే తాము విశ్వసిస్తామని తెలిపారు. తమ దేశ సౌభ్రాతృత్వం, భౌగోళిక సమగ్రతపై ఉక్రెయిన్‌ ప్రతినిధులు ఎప్పటికీ రాజీ పడబోరని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌ ` రష్యా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ‘’ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దుల నుంచి రష్యా చాలా తక్కువ సంఖ్యలో బలగాలను కదిలిస్తోంది. ఇది యుద్ధం నుంచి ఉపసంహరణ అనే కంటే దారి మళ్లించారు అనడం సరైందేమో. ఉక్రెయిన్‌లో ఇతర ప్రాంతాలపై భారీగా దాడులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కీవ్‌కు కూడా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు’’ అని పెంటగాన్‌ అధికారి ప్రతినిధి జాన్‌ కిర్బీ విూడియాతో అన్నారు.ఓ వైపు శాంతి ఒప్పందం దిశగా ఇరు దేశాలు చర్చలు జరుపుతుండగానే మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైకోలీవ్‌ ప్రాంతంలో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.

 

12.బీసీల లెక్క తేల్చండి..
` టీఆర్‌ఎస్‌ ఎంపీల డిమాండ్‌
న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి): కుల గణన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వర్‌ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జరపాలని ఎంపీలు కోరారు. కానీ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును ఇటు స్పీకర్‌, అటు చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో ఉభయసభల నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. అనంతరం విూడియాతో మాట్లాడారు.టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నామని తెలిపారు. కుల గణనపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చాం. దాని విూద చర్చ జరగాలని కోరాం. కానీ తమ నోటీసును తిరస్కరించారు. అందుకే సభ నుంచి వాకౌట్‌ చేశామని తెలిపారు. కుల గణన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్నామని, కేంద్ర మాత్రం మొండికేస్తోందని నామా ధ్వజమెత్తారు. 92 ఏళ్ల క్రితం కుల గణన జరిగింది. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కుల గణన గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.కుల గణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు గుర్తు చేశారు. ఓబీసీలకు పార్లమెంట్‌, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వాలని 2014లో తీర్మానం చేసి పంపించామని తెలిపారు. జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానం పంపించామన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తే.. వారికి మద్దతుగా ఉండి, పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని నామా నాగేశ్వర్‌ రావు స్పష్టం చేశారు.

 

13.సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
` డీఆర్డీవో వెల్లడి
బాలాసోర్‌,మార్చి 30(జనంసాక్షి): డీఆర్డీవో అధికారులు ఇవాళ మధ్యశ్రేణి మిస్సైల్‌ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడిరచారు. రెండు ప్రయోగాలు విజయవంతంగా సాగినట్లు అధికారులు చెప్పారు. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.. ఇండియన్‌ ఆర్మీకి చెందినట్లు అధికారులు తెలిపారు. మార్చి 27వ తేదీన రెండు సార్లు మిస్సైల్‌ను టెస్ట్‌ ఫైర్‌ చేశారు. ఏరియల్‌ టార్గెట్‌ను నేరుగా ఢీకొట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.

 

 

14.రైతులు ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయం : మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి,మార్చి 30(జనంసాక్షి): తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయి. సమయానికి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. పెట్టుబడి కోసం ఎవరి విూద ఆధారపడాల్సిన పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయం గడిరచాలన్నారు. కరోనా విపత్తు కారణంగా రైతుల రుణమాఫీ ఆలస్యమయిందని, రుణమాఫీని కచ్చితంగా చేసి తీరుతామన్నారు.