సావొ పాలొ: మాటలకందని మహాఘోరమిది. సభ్యసమాజం తలెత్తుకోలేని దారుణమిది. బ్రెజిల్‌లో 33 మంది కామాంధులు 16 ఏళ్ల యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సావొ పాలొ నగరంలోని మురికివాడలో తన స్నేహితుడి ఇంటికి బాధిత యువతి ఈ నెల 20న వెళ్లింది. ఆ రోజు రాత్రి నుంచి ఆదివారం వరకు 33 మంది ఆమెపై అత్యాచారం చేశారు. అంతేగాక అత్యాచార దృశ్యాలను ట్విటర్‌లో కూడా పోస్ట్‌చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.