16న టెట్‌ పరీక్ష

ఆదిలాబాద్‌, మార్చి 7 :  వాయిదా పడుతూ వస్తున్న టెట్‌ పరీక్షల ఎట్టకేలకు ఈ నెల 16న నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత నెల 9న జరగాల్సిన టెట్‌ పరీక్ష ఈ నెల 16న నిర్వహిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. ఈ పరీక్ష కోసం జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపరు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం విద్యా శాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.