హైదరాబాద్ : ఈనెల 17 నుంచి ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం ప్రకటించారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న సీమాంధ్ర పాలకుల తీరుపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. నెలాఖరులోగా హైదరాబాద్‌లో అన్ని సంఘాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.




