హైదరాబాద్,(జనంసాక్షి): పోలీసులు అరెస్టు చేసిన తెలంటగాణ ఉద్యోగ సంఘం నేతల్ని వెంటనే విడుదల చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం దగ్గర తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిని అప్జల్‌గంజ్ పీఎస్‌కు, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ ను సుల్తాన్‌బజార్ స్టేషన్‌కు తరలించారు. వీరి అరెస్టును ఖండించింన హరీష్‌రావు వీరిని వెంటనే విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.




