న్యూజిలాండ్ విజయలక్ష్యం 171 పరుగులు
చిట్టగాంగ్: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాడు డుమిని 43 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లు అండర్సన్, సౌథీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.




