Thursday, 5 November 2026

18న జరిగే బిఆర్ఎస్ పార్టీ మహాసభకు చీమలదండులా తరలి రావాలి : వైరాలో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు

18న జరిగే బిఆర్ఎస్ పార్టీ మహాసభకు చీమలదండులా తరలి రావాలి : వైరాలో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు

వైరా జనవరి13న జనం సాక్షి

వైరా పట్టణంలో కమ్మవారి కల్యాణ మండపం నందు స్థానిక శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్ గారి అధ్యక్షతన ,ఈ నెల18 వ తారీఖున ఖమ్మంలో జరగబోయే BRS పార్టీ జాతీయ మహాసభ సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు విచ్చేసినారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ TRS పార్టీ BRS జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మహాసభ ఈ జిల్లాలో జరగటం ,ఈ జిల్లా ప్రజల అదృష్టమని ,అందుకు ప్రతి గ్రామము నుంచి, ప్రతి పట్టణం నుంచి చీమలదండులా కదిలి రావాలని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదాలతో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు.అంతేకాకుండవైరా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాములు నాయక్ గారు కోరిక మేరకు వారు అడిగిన విధంగా 100 పడకల ఆసుపత్రికి మంజూరు కి హామీ తెలియజేశారు.వారితోపాటు గౌరవ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్ పల్లారాజేశ్వర్ రెడ్డి ,శ్రీధర్ రెడ్డి ,వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా విచ్చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ , వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు , ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, ఐదు మండలాల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు , సర్పంచులు , ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.