ప్రజలు సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలి
ఎస్ఐ శేఖర్ రెడ్డి
వీణవంక జనవరి 13 (జనం సాక్షి);
వీణవంక మండల ప్రజలు సంక్రాంతి పండుగ ఊర్లకు వెళ్ళే వారు తగు జాగ్రతలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఊర్లకు వెళ్లే సంధర్బంగా ఇండ్లను విడిచే వెళ్లిపోయే సమయంలో ఇంట్లో బంగారు, కానీ డబ్బులు ఇతర విలువైన వస్తువులు దొంగతనాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు పాఠశాల సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఇండ్లపై వెక్కి ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండ తల్లీ దండ్రులు పిల్లల గురించి తగు సూచనలు చేస్తూ వాటిని పాటించవలసిందిగా ఎస్ఐ శేఖర్ రెడ్డి ప్రజలను కోరారు. మీ ఏరియాలో అనుమానితులు ఎవరైనా కనబడితే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని లేదా డయల్ 100 ఫోన్ చేయాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని ఎస్ఐ శేఖర్ రెడ్డి సూచించారు. మండలంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల పోలీస్ యంత్రాంగం నిరంతర తనిఖీలు చేపడుతుందని, అలాగె జూదం, అడే వారి పట్ల పోలీసుల బృందాలు తో నిఘా ఉంచామని ప్రజలు ఎవరు కుడా జూదం, గంజాయి గాని డ్రగ్స్ గాని వైపు వెళ్లవద్దని అలాంటి వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.




